మండల ప్రజావాణికి ఒక దరఖాస్తు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం లోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ఒక దరఖాస్తు అందింది. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక అర్జీ స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. మారుతి, ఎమ్మార్వో టి శాంత మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.























