మూడు గూడుసల తండాకు ఐమాక్స్ లైట్ మంజూరు.. ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బీజేపీ నాయకుల కృతజ్ఞతలు!
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని మూడు గూడుసల తండాకు ఎంపీ నిధుల ద్వారా ఐమాక్స్ లైట్ మంజూరైనట్లు బీజేపీ నాయకులు తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఎంపీ నిధుల నుంచి ఈ లైట్ మంజూరైనట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్‌తో పాటు ఇందూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారికి బీజేపీ ధర్పల్లి మండల శాఖ తరఫున నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్, సీనియర్ నాయకులు కర్క గంగారెడ్డి, పాల్దీ దాసు, తాళ్ల రాము, యువజన అధ్యక్షుడు దోర్నాల రాజశేఖర్, కిసన్ మోర్సా రఘుపతిరెడ్డి, జ్ఞానేశ్వర్, కందూరు పవన్, చిలుక నరేష్, అచ్చుత్ రాజ్, వివేక్, దినేష్ యాదవ్, మైలారం శ్రీనివాస్ రెడ్డి, బాలు నాయక్, మోహన్ నాయక్, మోహన్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.

























