ధర్పల్లిలో జిల్లా స్థాయి క్రీడా పోటీలుఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహణ…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండలంలోని చిమన్‌పల్లి ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు జిల్లా స్థాయి క్రీడలు, ఆటల పోటీలు నిర్వహించనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థినులు పాల్గొననున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. క్రీడల్లో విద్యార్థులు క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి, జట్టు సమన్వయంతో ప్రతిభను చాటాలని పాఠశాల ప్రిన్సిపాల్ కోరారు. ఈ క్రీడా వేడుకలకు ప్రెస్ మీడియా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని ఆహ్వానించారు.

























