వాడి గ్రామంలో ఘనంగా శ్రీశ్రీ గురుగంగాధర్ స్వాముల వారి గురుపూజ ఆరాధన ఉత్సవాలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం వాడి గ్రామంలో శ్రీశ్రీ గురుగంగాధర్ స్వాముల వారి గురుపూజ ఆరాధన ఉత్సవాలను మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అల్లడి శ్రీనివాస్ స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీపారాధన, ధ్వజారోహణ, గణపతి పూజ, నవగ్రహ పూజ, పూర్ణాహుతి, బ్రహ్మయజ్ఞం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిపూర్వకంగా చేపట్టారు.
అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున వాడి, ముంబై పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ గురుపూజ ఆరాధన ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

























