లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టిన భీమ్‌గల్ పురపాలక సంఘం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం భీమ్‌గల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోదిరే స్వామి, నాగమణి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, ఎస్సై చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

























