ధర్పల్లిలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, టెలికాం వినియోగదారుల హక్కులు, ఫిర్యాదుల పరిష్కారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాయ్ తెలంగాణ ప్రాంతీయ ముఖ్య అధికారి ప్రభాకర్ రావు విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ పి. శ్రీనివాస్ సైబర్ భద్రత ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి ఎస్సై, సర్పంచ్, ఉపసర్పంచ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.























