భీంగల్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ పరిశీలన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలంలోని చెంగల్, పెద్దమ్మకాడి తండా, బడా భీంగల్ గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. భీంగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, నమోదు (ఎన్రోల్మెంట్) ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బీమా నమోదు కోసం వచ్చే దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు, బీమా పొందాలనుకునే వ్యక్తి వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా అందజేయాలని కోరారు. అదేవిధంగా నామినీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా నమోదు సమయంలో సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఏపీవో నర్సయ్య, గ్రామ కార్యదర్శులు వినయ్, మమత, రాహుల్, కంప్యూటర్ ఆపరేటర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

























