అయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…
ఇందూరు : అయ్యప్ప స్వామి దయ, ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.
నగరంలోని ఏడో డివిజన్‌తో పాటు మాక్లూర్ మండలం మాదాపూర్‌లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఇందూరులో అయ్యప్ప స్వామి మాలధారుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా యువత భక్తి మార్గం వైపు అడుగులు వేయడం సంతోషకరమన్నారు.
41 రోజుల పాటు చేపట్టే అయ్యప్ప మండల దీక్ష మనిషిలో ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, నియమ నిష్ఠలను పెంపొందించడంతో పాటు సాత్విక ఆహారపు అలవాట్లను అలవరుస్తుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి భక్తితో ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏడో డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, రాజేష్ స్వామి, అనిల్ స్వామి, రఘువీర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

























