Homeక్రైమ్ న్యూస్ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, ఫిబ్రవరి 26 : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించబడింది. జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా, ప్రభుత్వ ఆదాయం పెంపు మరియు అక్రమ తవ్వకాల నియంత్రణపై సమగ్రంగా చర్చించిన అనంతరం కలెక్టర్  కఠిన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో “మానా ఇసుక వాహనం” యాప్ ద్వారానే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్ అనుమతించబడదని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం లభిస్తుందని తెలిపారు.మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, ప్రస్తుతం మంజీరా నదిలో ఐదు ప్రభుత్వ రీచ్‌లు అనుమతించబడినప్పటికీ అవి పర్యావరణ అనుమతులకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల నుండి అవసరమైన పర్యావరణ క్లియరెన్సులు పొందిన తర్వాత మాత్రమే ఆ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిర్వహించడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలు చేపట్టరాదని కఠినంగా ఆదేశించారు. అదేవిధంగా మంజీరా నదిలో మూడు పట్టా భూములు జిల్లా కలెక్టర్ ఆమోదం పొందినట్లు తెలియజేసారు

వ్యవసాయ భూముల్లో ఉన్న ఇసుక మట్టెల తొలగింపు యాంత్రిక పద్ధతిలో కాకుండా కేవలం మానవ శక్తితో మాత్రమే నిర్వహించాలని, ట్రాక్టర్ల ద్వారానే రవాణా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియకు మండల వ్యవసాయాధికారి మరియు స్థానిక తహసీల్దార్ (ఎంఆర్ఓ)లకు అధికారాలు అప్పగించబడినట్లు తెలిపారు. రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించి మాత్రమే ఇసుక తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం కలగకూడదని గట్టిగా సూచించారు.జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక లేదా గ్రావెల్ తవ్వకం, రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే సుమోటో కేసులు నమోదు చేయాలని కలెక్టర్  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ రవాణా లేదా తవ్వకాలు జరిగిన పక్షంలో సంబంధిత వాహనాలను సీజ్ చేయడం, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం మరియు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అక్రమ ఇసుక మరియు గ్రావెల్ తవ్వకాల నియంత్రణపై కలెక్టర్  స్పందిస్తూ ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.ఈ బాధ్యత కేవలం రెవెన్యూ శాఖ మరియు గనుల శాఖకే పరిమితం కాదని, పోలీసు శాఖ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో కలిసి ఒకే వేదికపై పనిచేసి అక్రమ తవ్వకాలు మరియు రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా, నియంత్రితంగా అమలు కావాలని కలెక్టర్  ఇలా ట్రిపాఠి  స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మైనింగ్ ఏ.డీ సంజయ్ కుమార్, రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ ఆర్.డబ్ల్యూ.ఎస్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గ్రౌండ్ వాటర్, హౌసింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

Translate »
error: Content is protected !!