త్రిశూల్ న్యూస్ నిజామాబాద్ రూరల్
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం డిచ్పల్లి మండలం *కొరాట్ పల్లి సర్పంచ్ పోతే ప్రభాకర్* బిఆర్ఎస్ పార్టీని వీడి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మేల్యే డా.ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో.. సర్పంచ్ తో పాటు పలువురు పార్టీలో చేరగా .. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ మేరకు ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు సర్పంచులు పార్టీలో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్ పల్లి మండల పార్టీ అధ్యక్షుడు అమృత పూర్ గంగాధర్, పార్టీ నాయకులు తారాచంద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

























