నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 324 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరియు పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ పంపిణీని చేపట్టారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత రాష్ట్రం అప్పుల కష్టాల్లో ఉన్నప్పటికీ, పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. షాదీ ముబారక్: 194 మంది లబ్ధిదారులకు రూ. 1,94,22,504 కళ్యాణ లక్ష్మి: 130 మంది లబ్ధిదారులకు రూ. 1,30,15,080 మొత్తంగా దాదాపు రూ. 3,24,37,584 విలువైన చెక్కులను అందజేయడం జరిగిందని వివరించారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ,
ప్రజా పాలనలో అప్రతిహతంగా అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కీలకమైన హామీలను నెరవేర్చిందని గుర్తు చేశారు. కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం మాది.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నాయి. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాల కల్పన మరియు సన్నబియ్యం పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, NUDA చైర్మన్ కేశ వేణు, స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

























