రంజాన్ పండుగ ( ఈద్-ఉల్-ఫితర్ ) సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు మరియు ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన : పోలీస్ కమీషనర్
నేడు నిజామాబాదు పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాదు ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ ఈద్గాలు మరియు ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., పర్యవేక్షణ చేయడం జరిగింది.
ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడితు రంజాన్ పండుగ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించడము జరిగింది అని, ప్రజలకు క్షేత్రస్థాయి నుండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ మరియు భద్రత చర్యలను ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పండుగ దృష్ట్యా మార్కెట్లు మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో షీ టీమ్స్ (She Teams) ద్వారా నిఘా ఉంచడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ శాంతియుతంగా, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ ఈద్గాల వద్ద ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ నగరం లొ శాంతినగర్ ఈద్గాల మదిన ఈద్గాల బోధన్ లోని నర్సి రోడ్డు ఈద్గాలను పోలీస్ కమిషనర్ పర్యవేక్షించడం జరిగింది
ఈ సందర్భంగా నిజామాబాద్ ఎ.సి.పి ప్రకాష్ , బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి , ఆర్మూర్ ఎ.సి.పి వెంకటరెడ్డి మరియు సిఐలు , ఎస్సైలు తదితరులు పాల్గొనడం జరిగింది

























