ధర్పల్లి: చేపల మార్కెట్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
శుక్రవారం : 03/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలో ఆధునిక చేపల మార్కెట్ నిర్మాణానికి 500 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు శుక్రవారం సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. మత్స్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు మార్కెట్ ఏర్పాటుకు అవకాశం లభించిందని, తగిన భూమిని కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.























