ధర్పల్లి లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి
గురువారం : 09/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరి ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర 2389,బి గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర2369 ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, సర్పంచ్ సిహెచ్. శ్రీనివాస్, సీఈవో సంతోష్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.























