Homeత్రిశూల్ న్యూస్కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి...

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఇబ్బందులు

కేంద్ర ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి పసుపు రైతులు ఆందోళన చెందవద్దు అని విలేకరుల సమావేశం నిర్వహించి నిర్వహించారు.

ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు ఆన్లైన్ సాఫ్ట్వేర్ పాయింట్ టూ ద్వారా వచ్చిన ఇబ్బందులను పూర్తిగా వివరించారు. 2004 నుంచి 2014 వరకు నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా కొనసాగిన సమయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చిన వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించడం జరిగిందని, 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఆన్లైన్ తీసుకువచ్చి రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా కొనుక్కునే అవకాశం కల్పించాలని. ఆన్లైన్ వస్తే రైతులకు మద్దతు ధర వస్తుందా లేకుంటే నష్టపోతారా అనే భయం ఉన్నప్పటికీ మొదటగా నిజామాబాద్ లో ఆన్లైన్ పద్ధతి తీసుకురావడం జరిగిందని, 2014 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం కోల్పోయిన తర్వాత 2016లో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో పాయింట్ జీరో పద్ధతిలో ప్రవేశ పెట్టడం జరిగిందని, ఆన్లైన్ పద్ధతి ప్రవేశపెట్టిన మొదట ఎన్నో ఇబ్బందులు రావడం జరిగిందని రెండు సంవత్సరాలు దానిని సవరించడానికి సమయం తీసుకుందని ఆయన అన్నారు. దేశంలనే 10 లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చే పెద్ద మార్కెట్ నిజామాబాద్ మార్కెట్ అని, నిజామాబాద్ మార్కెట్ కు సాంగ్లీ, ఈరోడ్ మార్కెట్లతో పోటీ ఉంటుందని, ఆ మార్కెట్లలో ఉన్న ధరల కంటే ఎక్కువ ధర ఇక్కడ వచ్చే విధంగా పోటీ పడాల్సి ఉంటుందని, ఒక సందర్భంలో రైతులు నిజామాబాద్ మార్కెట్లో తక్కువ ధర ఉంది సాంగ్లీలో ధర ఎక్కువ ఉంది అని ధర్నా చేసిన సమయంలో అప్పుడు ఉన్న కలెక్టర్  ఆధ్వర్యంలో సాంగ్లీ లో ఏ విధంగా పసుపు వస్తుంది అని నిజామాబాద్ లో ఏ విధంగా వస్తుంది అని తెలుసుకోవడానికి ఇక్కడి నుండి రెండు బస్సుల నిండా రైతులను మీడియా మిత్రులను తీసుకొని సాంగ్లీ వెళ్లడం జరిగిందని, సాంగ్లీలో 3000 కంటే క్వింటాల కంటే ఎక్కువ పసుపు రాదు అని నిజామాబాద్ మార్కెట్లో సీజన్ బట్టి రోజుకు 50 వేల నుండి 60 వేల క్వింటాళ్ల పసుపు వస్తుంది అని, సాంగ్లీలో కేవలం శాంపిల్ ను బట్టి మాత్రమే రేటును నిర్ణయిస్తారని,గ్రేడ్ లేకుండా కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని, కానీ ఇక్కడి మార్కెట్లో కుప్పలు పోయడం జరుగుతుందని, 2009లో సాంగ్లీ లో 16 వేల రూపాయల మద్దతు ధర ఉంటే నిజమాబాద్లో 10 నుండి 12000 మాత్రమే ఉండేదని, ఇక్కడ పచ్చి, మీడియం, ఎండినది మూడు రకాల పసుపు వస్తుందని, దేనికి ఏ విధంగా ధర నిర్ణయించాలని ఆలోచనతో మూడు వేర్వేరు స్థానాలలో కుప్పలు పోయించడం జరిగిందని, దీని ద్వారా సాంగ్లీ కంటే ఎక్కువగా 17 వేల రూపాయలు క్వింటాల్కు ధర కల్పించడం జరిగిందని నగేష్ రెడ్డి తెలియజేశారు. 2009లో తులం బంగారం 18 వేల రూపాయలు ఉంటే క్వింటాల్ పసుపు ధర 17వేల రూపాయలు వచ్చిందని ఆ విధంగా మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన అన్నారు. 2016లో పాయింట్ జీరో తో ఆన్లైన్ సాఫ్ట్వేర్ పద్ధతిని ప్రారంభించడం జరిగిందని రెండు నెలల క్రితం వరకు అదే సాఫ్ట్వేర్ కొనసాగిందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 0.2 కు తీసుకురావడం జరిగిందని గతంలో ఉన్న కాంట్రాక్టర్ తో ఒప్పందం అయిపోవడంతో వేరే వారికి చేయడం ద్వారా సాఫ్ట్వేర్లు నిజామాబాద్ మార్కెట్ ను ఇంక్లూడ్ చేయకుండా బిజెపి కుట్ర చేసిందని, పసుపు బోర్డు నిజామాబాదులో ఉన్నప్పటికీ ఎందుకు నిజమాబాద్ మార్కెట్ ను సాఫ్ట్వేర్లు ఇంక్లూడ్ చేయలేదు అని బిజెపి నాయకులను నగేష్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యపు పనికి మా మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కడే ఉంటూ సాంగ్లీ మార్కెట్లో ఉన్న ధరను ఇక్కడ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని , ప్రస్తుతం సాంగ్లీ మార్కెట్లో ఉన్న రేటు నిజామాబాద్లో కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని వెంటనే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సాఫ్ట్వేర్ 0.2 లో నిజామాబాద్ మార్కెట్ ఇంక్లూడ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ అలా చేయకుండా రైతులను రోడ్ల మీదికి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరైనది కాదు అని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు నల్ల చట్టాలను తీసుకురావడం జరిగిందని, పంజాబ్ రైతులు నిరంతరం పోరాటం చేయడం ద్వారా వాటిని వెనక్కి తీసుకోవడం, అదేవిధంగా ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెట్టుకోవడం ద్వారా దేశ రైతులు నష్టపోవడం జరుగుతుంది అని, అమెరికాలో వేల ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తారని ఒక ఎకరాకు 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, అటువంటి దానిని జీరో టాక్స్ ద్వారా మన దేశానికి దిగుమతి చేస్తున్నారని ఇక్కడున్న మొక్కజొన్న ఎటు పోవాలని, దీని ద్వారా రైతులు నష్టపోతారని కావున వెంటనే వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని నగేష్ రెడ్డి అన్నారు. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ధర్నా చేసే జైల్లో పెడితే అనంతరం జిల్లా కేంద్రంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ సత్య గ్రహ దీక్ష చేయడం జరిగిందని, వెంటనే వాణిజ్య ఒప్పందం ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు.
అదేవిధంగా అరవింద్ నిజామాబాద్ లో పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నాడని పసుపు బోర్డు ద్వారా రైతులకు నిజంగా లాభముంటే ఎందుకు పసుపు రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారో అరవింద్ చెప్పాలని ,పసుపు బోర్డు ద్వారా రైతులకు వచ్చే లాభాలు ఏమీ లేవని పసుపుకు మద్దతు ధర కల్పిస్తే రైతుకు లాభాలు ఉంటాయి కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పసుపు కు మద్దతు ధర ప్రకటించేలా అరవింద్ కేంద్రంలో కొట్లాడాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి కోశాధికారి భక్తవస్తలం డిల్లీ,డిసిసి ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి,కార్పొరేటర్లు ప్రవీణ్ గౌడ్,పంచారెడ్డి చరణ్, ఎర్రం గంగాధర్,అమర్ సింగ్,నరేందర్, హరిచంద్,డిసిసి ప్రధాన కార్యదర్శి రవి,జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్,మాజీ కార్పొరేటర్ శివ,టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,టౌన్ ఎస్టి సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్,సంగెం సాయిలు మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...

Translate »
error: Content is protected !!