Homeత్రిశూల్ న్యూస్నిజామాబాద్ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు 

నిజామాబాద్ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు 

పూర్తయి నాలుగేళ్లయిన కేటాయించలేదు..

ఇందిరమ్మ ఇళ్లకు స్థలం ఇవ్వాలి

అసెంబ్లీ లో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

త్రిశూల్ న్యూస్ ఇందూరు:నిజామాబాద్ అర్బన్ లో గత తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా అందించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూంపై మాట్లాడారు. ఇందూరు నాగారం ప్రాంతంలో 396 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి నాలుగున్నర సంవత్సరాలు గడిచిందని గుర్తు చేశారు. బీ ఆర్ ఎస్ నాయకులు కమిషన్లు తీసుకున్నారు, కానీ ఒక్క ఇల్లు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. ఏళ్లుగా వృధాగా ఉండటంతో ఇళ్ల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయని, పలు వస్తువులు చోరీకి గురయ్యాయని చెప్పారు. అనేకసార్లు మంత్రులకు విన్నపించడంతో మరమ్మతుల కోసం 1.25 కోట్లు విడుదల చేశారని, కానీ ఇళ్లు మాత్రం కేటాయించలేదన్నారు. అనవసరంగా ప్రజాధనం వృధా అవుతుందని చెప్పారు. అలాగే కలెక్టరేట్ సమీపంలో 200 డబుల్ బెడ్రూం ఇళ్లు 80 శాతం పూర్తి చేసుకున్నాయని, మరో 2 కోట్లు మంజూరు చేస్తే పూర్తవుతాయన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో వివిధ దశల్లో ఉన్న మరి కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మరో 3 కోట్లు కేటాయిస్తే సుమారుగా వేయి ఇళ్లు పూర్తవుతాయన్నారు.  అలాగే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా స్థలంతో పాటు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం ఒకటి కూడా అందించలేదన్నారు. ఇక రెండో సంవత్సరం స్థలం ఉన్నవారికి ఐదు లక్షల అందిస్తామని చెప్పారు. కానీ నిజామాబాద్ అర్బన్ లో స్థలం ఉన్న పేదవారు చాలా తక్కువ మంది ఉంటారని, వారు స్థలం కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. కావున ప్రభుత్వ స్థలం చూయించి, అర్హులకు ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

0
వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు…

0
ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు...

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

Translate »
error: Content is protected !!