ఒకే ఊరు.. ఒకే వినాయకుడు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లోతిర్మాన్‌పల్లి గ్రామస్తుల ఐక్యత అభినందనీయం. గ్రామాభివృద్ధికి మరింత కృషి చేస్తా: ఎమ్మెల్యే భూపతి రెడ్డి.గణేశ్ మండపంలో ఎమ్మెల్యే పూజలు గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఒకే చోట మట్టి వినాయకుడిని ప్రతిష్టించి గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు.అభినందనీయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.నిజామాబాద్ రూరల్ మండలం తిర్మాన్‌పల్లి గ్రామంలో ‘ఒకే ఊరు.. ఒకే వినాయకుడు’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఆదివారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి,ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలంతా కలిసి ఒకే మట్టి వినాయకుడిని ప్రతిష్టించడం ద్వారా ఐక్యత,సోదరభావం, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటారని అన్నారు.గ్రామస్తులందరూ కలిసికట్టుగా పండుగను నిర్వహించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు.తిర్మాన్‌పల్లి గ్రామంపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు.గ్రామ ప్రజల అవసరాలు,సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని,భవిష్యత్తులో కూడా తిర్మాన్‌పల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గణేష్ నవరాత్రిఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు,వినాయక మండలి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోహన్, కాంగ్రెస్ పార్టీనాయకులుసాయరెడ్డి,భాస్కర్ రెడ్డి,పార్టీ మండల అధ్యక్షులు.జనార్దన్,పొలసాని.శ్రీనివాస్,అంబర్ సింగ్,సంజయ్ రెడ్డి,నరేష్, బాలరాజు,ఆయా గ్రామాల ప్రజలు,వినాయక మండలి నిర్వాహకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.























