సితాయిపేట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిహెచ్. భూమేష్ విద్యార్థులకు యూనిఫాం దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి, మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగేటి చంద్రకాంత్, పాఠశాల చైర్మన్ మౌనిక, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

























