జీపీ నిధులతో నూతన ఐమాక్స్ లైట్లు ఏర్పాటు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లిలో గ్రామపంచాయతీ నిధులతో బుధవారం నూతన ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ వెలుగులు మెరుగుపరచడంతో ప్రజలకు రాత్రివేళల్లో సౌకర్యం కలగనుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, వీడీసీ ఛైర్మన్ ఆర్మూర్ రంజిత్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వార్డు సభ్యుడు గణపురం రాజు తదితరులు పాల్గొన్నారు.

























