గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి
గోహత్యలను నిషేధించాలని దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ గడిల లింగం
కామారెడ్డి: గోహత్యలను నిషేధించాలని, గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టణంలోని జై హనుమాన్ యోగా కేంద్రంలో యోగా గురువు గరిపల్లి అంజయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా యోగా గురువు గరిపల్లి అంజయ్య మాట్లాడుతూ, గోమాత సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గోహత్యల నిషేధం, గోమాతను విశ్వమాతగా ప్రకటించాలనే డిమాండ్లకు మద్దతుగా ప్రజలు పెద్ద సంఖ్యలో సంతకాలు చేయాలని కోరారు.
జై హనుమాన్ యోగా కేంద్రం సభ్యులందరం కలిసి సుమారు 10 వేల సంతకాలు సేకరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని వివిధ యోగా కేంద్రాలు, క్లబ్‌లలోనూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు ఎల్లంకి సుదర్శన్, గోపాల్, పార్షి సతీష్, మోట్కూరి విట్టల్, ఈశ్వర్, వెంకటేశ్, ముప్పారపు రాజేందర్, శ్రీను, కరెంట్ రాజేందర్, ఆమెటి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

























