పల్వంచలో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ఆటపాటలతో సందడి చేసిన ఆడపడుచులుపకడ్బందీగా ఏర్పాట్లు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
పల్వంచ: కామారెడ్డి పట్టణ సమీపంలోని పల్వంచ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి.
రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చిన్నాపెద్దా తేడా లేకుండా గ్రామంలోని మహిళలు, యువతులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో గ్రామమంతా సందడిగా మారింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్తులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా భద్రత, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
యువత, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తుల సమష్టి సహకారంతో సద్దుల బతుకమ్మ సంబరాలు విజయవంతంగా ముగిశాయి.

























