Homeతెలంగాణఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

_నివాసయోగ్యంగా ఉంటే చాలు.. ఫ్లోరింగ్, వైరింగ్ లేకున్నా కంప్లీషన్ కిందకే.._

_గృహప్రవేశాలు చేసుకునేలా_ _నిబంధనలు సడలించిన ప్రభుత్వం_

_హైదరాబాద్ : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది._

_ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ నిబంధనలను సడలించింది. ఇల్లు వంద శాతం పూర్తి కాకపోయినా.. నివాసయోగ్యంగా ఉంటే చాలు తుది విడత బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు._

_గతంలో అమలులో ఉన్న రూల్స్ ప్రకారం.. ఇంటి ఫ్లోరింగ్, లోపలి ప్లాస్టరింగ్, పూర్తిస్థాయి ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి ఫినిషింగ్ పనులు పూర్తయితేనే కంప్లీషన్ స్టేజ్ ఫొటోలను లబ్ధిదారులు అప్‌లోడ్ చేసే వీలుండేది. ఆ తర్వాతే ప్రభుత్వం బిల్లులు రిలీజ్ చేసేది. అయితే, నిరుపేద లబ్ధిదారులు ఆర్థిక స్థోమత లేని కారణంగా ఈ చిన్న చిన్న పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారని, ఫలితంగా తుది విడత బిల్లులు నిలిచిపోతున్నాయని సర్కారు గుర్తించింది. వారు త్వరగా గృహప్రవేశం చేసుకునేలా నిబంధనలను సరళతరం చేసింది._

*_సవరించిన నిబంధనలు ఇవే.._*

_ఫ్లోరింగ్ అవసరం లేదు : ఇంటి_ _లోపల ఫ్లోరింగ్(నేల) పని పూర్తి_ _కాకపోయినా బిల్లులు_ _ఆపకూడదు. లబ్ధిదారులు తమ ఆర్థిక స్థోమతను బట్టి తర్వాత దీన్ని పూర్తి చేసుకోవచ్చు._

_ప్లాస్టరింగ్ : ఇంటి వెలుపలి ప్లాస్టరింగ్ పూర్తయితే చాలు. లోపలి వైపు ప్లాస్టరింగ్ లేకున్నా తుది విడత బిల్లు మంజూరు చేస్తారు._

_తలుపులు, కిటికీలు : లోపలి గదులకు తలుపులు లేకపోయినా పర్వాలేదు. కేవలం ఇంటి ప్రధాన ద్వారం(ఎక్స్‌టర్నల్ డోర్) ఉంటే సరిపోతుంది._

_పెయింటింగ్: బయటి వైపు వైట్ వాష్/పెయింటింగ్ ఉంటే చాలు. రెండో కోట్ పెయింటింగ్ నిబంధనను తొలగించారు._

_వైరింగ్, ప్లంబింగ్ : పూర్తిస్థాయి వైరింగ్ లేకపోయినా, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ఉన్నా సరిపోతుంది._ _టాయిలెట్, ఫ్యాన్ బిగించడం వంటి ప్లంబింగ్ పనులు తప్పనిసరి కాదు._

_అమలుకు కలెక్టర్లకు ఆదేశాలు_

_రూల్స్ లో చేసిన మార్పులకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది కేవలం ఇంటి నిర్మాణ పటిష్టత(స్టక్చరల్ కంప్లీషన్)పై దృష్టి పెట్టాలని, చిన్న చిన్న హంగుల కోసం బిల్లులు ఆపవద్దని సూచించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా తుది దశలో ఉన్న వేలాది ఇండ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమమైంది._

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

Translate »
error: Content is protected !!