Homeతెలంగాణగ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డు...

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డు అందజేత

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డు అందజేత

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో సామాన్యుల కళ్లముందే జరుగుతున్న దోపిడీని అప్రమత్తతతో ఎండగట్టిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనర్, ఐపీఎస్  అభినందించారు.

ధైర్యంగా గ్యాస్ మాఫియా గుట్టురట్టు చేయడాన్ని కొనియాడుతూ, శనివారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో వారిని ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేసి, పౌర చైతన్యానికి మారుపేరుగా నిలిచారని ప్రశంసించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రతి పౌరుడు ఇలాగే చైతన్యంతో స్పందించినప్పుడే నేరరహిత సమాజం నిర్మించగలమని పేర్కొన్నారు.

చూడిబజార్‌కు చెందిన వ్యాపారి అశోక్ తివారీ గత నెల 21న గ్యాస్ సిలిండర్ ను బుక్ చేశారు. డెలివరీ సమయంలో బరువు తక్కువగా ఉండటాన్ని ఆయన కుమారుడు 16 ఏళ్ల నమాన్ తివారి  గమనించారు. గత డెలివరీ సమయంలోనూ ఇలాగే సిలిండర్ రెండు కిలోలు తక్కువగా ఉందని తన తండ్రి దృష్టికి  తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం 30.4 కిలోలు ఉండాల్సిన సిలిండర్, కేవలం 28 కిలోల బరువు మాత్రమే ఉందని చెప్పారు.

గత కొంతకాలంగా గ్యాస్ త్వరగా అయిపోతుండటంతో అనుమానం వచ్చి బరువు తనిఖీ చేయగా, సుమారు రెండు కిలోల గ్యాస్ తక్కువగా ఉన్నట్లు తేలింది.

తనకు గ్యాస్ సిలిండర్ ను సరఫరా చేసే సిద్ధార్థ ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ ప్రతినిధులను ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానం ఇచ్చారు. అయితే పట్టువదలని తండ్రీకొడుకులు దీనిపై ఆరా తీయగా, సదరు ఏజెన్సీ ఉద్యోగులు గ్యాస్‌ సిలిండర్లను జుమేరాత్ బజార్ లోని ఒక ఇంట్లో అక్రమంగా చిన్న సిలిండర్లలోకి, వాణిజ్య అవసరాల కోసం రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ గోషామహల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేవలం గ్యాస్ తక్కువగా ఇవ్వడమే కాకుండా, జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర రీతిలో రీఫిల్లింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిద్దార్థ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సాయి కుమార్, వినీత్ కుమార్, పూస గణేష్, ప్రవీణ్ కుమార్, అమిత్ కుమార్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 కమర్షియల్, 7 డొమెస్టిక్, 12 చిన్న సిలిండర్లతో పాటు రీఫిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గొడవల్లో నోటిని కంట్రోల్ చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్

0
గొడవల్లో నోటిని కంట్రోల్ చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్ తెలంగాణ : కుటుంబ వ్యవస్థలో దంపతులు సర్దుకుపోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో 'మీ...

ఉప్ప‌ల్ లో ఖత్రి భవన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ భగాయత్ లో వంజరి...

0
ఉప్ప‌ల్ లో ఖత్రి భవన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉప్పల్ భగాయత్ లో వంజరి కుల ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి      *ఉప్ప‌ల్ లో సీఎం రేవంత్...

ధర్పల్లి: అంబులెన్స్‌లో మహిళకు ప్రసవం

0
ధర్పల్లి: అంబులెన్స్‌లో మహిళకు ప్రసవం ఆదివారం : త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన గర్భిణి గీతను ప్రసవం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో బీబీపూర్ తండా...

రుతుపవనాలు మహారాష్ట్ర తలుపు తట్టాయి, కానీ పొడి-గాలి లాగడం వల్ల లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఏర్పడుతుంది

0
నైరుతి రుతుపవనాలు శనివారం రావడంతో దక్షిణ కొంకణ్‌లో చాలా అవసరమైన వర్షం కురిసింది, ఇది రైతులకు ఉపశమనం మరియు ఆశాజనకంగా ఉంది. పూణె: నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో...

నిషేధించబడిన హుక్కా రుచులు, గంజాయి, మద్యం: పూణెలో అర్థరాత్రి పార్టీ దాడిలో 107 మంది పురుషులు, 49 మంది...

0
పూణే రేవ్ పార్టీకి చెందిన మైనర్లతో సహా 156 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూణె: లోనికండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులాపూర్‌లో ఆదివారం తెల్లవారుజామున పూణే సిటీ పోలీసుల క్రైమ్...

Translate »
error: Content is protected !!