Homeతెలంగాణఅభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం కలెక్టర్...

అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

నిజామాబాద్, మే 02 : ఈ నెల 3వ తేదీన(ఆదివారం) జరగనున్న నీట్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జ‌రగ‌నున్ననీట్ ప‌రీక్ష‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో 3334 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఈ మేరకు డిచ్పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ భవనంలో, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భవనంలో, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని యూజీ బ్లాక్ లో, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్ లో, బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, నిజామాబాద్ కంటేశ్వర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, మాక్లూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని అన్నారు. కాగా, అభ్యర్థులు పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి కనీసం అరగంట ముందే లోనికి చేరుకోవాల్సి ఉన్నందున, నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని అన్నారు. నిర్ణీత సమయం దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్ లోనికి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు ముందస్తుగానే చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, ఐ.డి ప్రూఫ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఉపకారణాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి అనుమతించబడవని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, పకడ్బందీ నిఘా నడుమ సజావుగా పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నామని, గట్టి పోలీసు బందోబస్తు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

0
భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా...

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

Translate »
error: Content is protected !!