సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలోని హోటల్స్, టిఫిన్ సెంటర్స్, బేకరీ,ఫాస్ట్ ఫుడ్ సెంటర్,కిరాణా షాప్, పండ్లు కూరగాయలు , మాంసం అమ్మే షాపులు అన్ని రకాల వ్యాపార సముదాయాల
యజమానులకు తెలియజేయునది ఏమనగా సింగల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడం జరిగినది. కావున అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించే యజమానులు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వినియోగించకూడదని తెలియజేయడమైనది. ఒకవేళ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వినియోగించినట్లయితే మున్సిపల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించడంతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ గజానంద్ తెలియజేశారు.

























