ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి.పునరుత్పాదక విద్యుత్ వనరులను ప్రోత్సహించడం అభినందనీయమని,ఈ కాలంలో సౌర విద్యుత్ తరగని ఆస్తి వంటిదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి అన్నారు.ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.డిచ్‌పల్లి మండల కేంద్రంలో దేవ్‌పల్లి సర్పంచ్.సురేష్ వీరమల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారాహి సోలార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి రిబ్బన్ కట్ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయ నిర్వాహకులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసిఅభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు సరికొత్త ఆలోచనలతో సౌర విద్యుత్ రంగంలో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా రాయితీపై సౌర విద్యుత్ పరికరాలను సరఫరా చేయడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రముఖ సంస్థలైన టాటా, అదానీ తదితర కంపెనీల సౌజన్యంతో రాయితీపై సౌర విద్యుత్ పరికరాలను అందించడం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం పెరగడం వల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.వారాహి సోలార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప.గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు. వాసు,నాయకులు పొలసాని శ్రీనివాస్ , భాస్కర్ రెడ్డి,అమృతాపూర్. గంగాధర్, రాంచందర్ గౌడ్, శ్యాంసన్ ధర్మాగౌడ్,సంస్థ ప్రతినిధులు,స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.























