ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం…
తెలంగాణ సమాజం మెచ్చిన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి చేసిన అనుచిత, అహంకారపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో విమర్శలు రాజకీయంగా, విధానపరంగా ఉండాలి కానీ, ఇలా ఒక ముఖ్యమంత్రి శరీర ఆకృతిని (Body Shaming) కించపరుస్తూ మాట్లాడటం, వ్యక్తిగత దూషనలకు దిగజారడం అరవింద్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.
## ఎంపీ అరవింద్ ను సూటిగా అడుగుతున్నా. నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉందానని అడుగుతున్నా:
* సంస్కారం లేని రాజకీయం: ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇదేనా? మీ పార్టీ నేతలైన మీ భాషను సమర్థిస్తున్నారా? నీతులు చెప్పడం, నికృష్ట రాజకీయాలు చేయడమే మీ సిద్ధాంతమా? అయినా మీ వ్యవహారమంతా వాషింగ్ పౌడర్ నిర్మా సిద్ధాంతమేగా
* బాడీ షేమింగ్ తగదు: రాజకీయం చేతకాక, వ్యక్తిగత, శారీరక ఆకృతిపై మాట్లాడటం మీ సంస్కారహీనతను చూపిస్తోంది. ఇదేనా మీకు హైందవ ధర్మం నేర్పేది. మీలాంటి వాళ్ళ వాళ్లనే, దేశం చులకన అవుతుంది.
* ప్రజల ముఖ్యమంత్రి: రేవంత్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు, ప్రజాబలంతో గెలిచిన నేత. మీలాంటి వారి అడ్డగోలు మాటలతో ఆయన ప్రతిష్ట తగ్గదు. జనబలంలేని మీ మాటల్ని ప్రజలు ఏ మాత్రం సమర్థించరు.
* ఓటమి భయం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా రంజక పాలన చూసి, బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే వాళ్లకు పిచ్చిముదిరి, పిచ్చి కుక్కల్ల మాట్లాడుతున్నారు.
* నిజామాబాద్ అభివృద్ధి వదిలేసి, ప్రజలను అడుగడుగునా మోసం చేసిన చరిత్ర మీది.
* భాష మార్చుకోకపోతే ఊరుకోం: ఇకనైనా ముఖ్యమంత్రి పై నోరు పారేసుకోవడం మానుకోకపోతే కాంగ్రెస్ శ్రేణులు తగిన బుద్ధి చెబుతాయి.
తెలంగాణ సంస్కృతిలో ఇటువంటి వ్యక్తిగత దూషణలకు తావులేదు. అరవింద్ ధర్మపురి తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. లేదంటే సభ్య సమాజం క్షమించదని గుర్తు చేస్తున్నాను.

























