కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు కేటాయించిన భూమిలో భాగంగా ఉప్లూర్ శివారు, సర్వే నంబర్ 271/1లో ఒక ఎకరం భూమిని తన భార్య సిరిమల్ల లావణ్య, భర్త: గంగాధర్ పేరు మీద పాత పాసుబుక్ లో రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారని,


అయితే, భూమి రిజిస్ట్రేషన్ జరిగినప్పటి నుండి ఇప్పటివరకు నా భార్య పేరు మీద సంబంధిత రెవెన్యూ రికార్డుల్లో ధరణి/కొత్త పట్టాదారు పాస్‌బుక్ జారీ కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ధరణి వ్యవస్థ అమల్లోకి వచ్చిన అనంతరం కూడా మా భూమికి సంబంధించిన వివరాలు ధరణి రికార్డుల్లో పూర్తిగా నమోదు కాలేదనీ
కావున, దయచేసి మా సమస్యను పరిశీలించి, సంబంధిత రికార్డులను పరిశీలించి, మా భూమి వివరాలను ధరణి/భూ భారతి రికార్డుల్లో నమోదు చేసి, నా భార్య సిరిమల్ల లావణ్య పేరు మీద పట్టాదారు పాస్‌బుక్ (ధరణి బుక్) మంజూరు చేయవలసిందిగా సోమవారం కమ్మర్పల్లి లో జరిగిన ప్రజావాణి లో వినతి పత్రం అందజేశారు.

























