హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కమ్మర్‌పల్లి SI, CH.సతీష్ గారు తెలిపారు.
ఘటన వివరాలు:
ఈ నెల 21-08-2026 హసకోత్తూర్ గ్రామ మారుతీనగర్ ట్యాంక్ బండ్ వద్ద వేముల సుదర్శన్‌పై పాత కక్షలతో ఇరుగదిండ్ల సాయిలు మరియు తన కొడుకు ఇరుగదిండ్ల అరుణ్ లు గొడవపడి, ఇద్దరూ కలిసి సుదర్శన్‌ను చంపాలనే ఉద్దేశంతో గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో సుదర్శన్ కు తీవ్ర రక్తగాయాలవడంతో ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అరెస్ట్ వివరాలు:
బాధితుని తమ్ముడు వేముల పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు ఇరుగదిండ్ల సాయిలు, ఇరుగదిండ్ల అరుణ్‌లను ఈరోజు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

























