హామీల అమలుకు కౌన్సిలర్ కృషి
అభివృద్ధి పనులపై కౌన్సిలర్‌కు ఘన సన్మానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ : పట్టణంలోని విద్యానగర్ కాలనీ రెండో వార్డు కౌన్సిలర్ పర్శ కుశలత అనంతరావును మంగళవారం కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కాలనీలో అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో పలువురు నాయకులను ఎన్నుకున్నప్పటికీ కాలనీ అభివృద్ధిపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదని కాలనీవాసులు పేర్కొన్నారు. ప్రస్తుత కౌన్సిలర్‌కు సమస్యలను తెలియజేస్తే వెంటనే స్పందిస్తూ, ప్రజల వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్‌ను ఈ సందర్భంగా కాలనీవాసులు అభినందించి సన్మానించారు.

























