అక్రమ మోరం తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు
అటవీ ప్రాంతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు: రేంజ్ అధికారి రవి మోహన్ బట్…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలోని తిరుమలాయిపల్లి తండా పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మోరం తవ్వకాలు చేపట్టిన వ్యక్తిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి, జరిమానా విధించారు.
ఇందల్వాయి అటవీ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి సెక్షన్ అధికారి ప్రభాకర్, గన్నారం బీట్ అధికారి వందనతో కలిసి అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో తిరుమలాయిపల్లి తండా పరిధిలో దేగావత్ గంగారం అనే వ్యక్తి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అటవీ ప్రాంతంలో మోరం తవ్వకాలు చేపడుతున్నట్లు గుర్తించారు. దీంతో అతనిపై అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమంగా మోరం తవ్వకాలు నిర్వహించినందుకు సంబంధిత వ్యక్తికి రూ.9,945 జరిమానా విధించినట్లు రేంజ్ అధికారి తెలిపారు.
అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా మోరం తవ్వకాలు చేపట్టినా, వన్యప్రాణులను వేటాడినా, చెట్లను నరికినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అటవీ సంపదను కాపాడేందుకు ప్రజలందరూ అటవీ శాఖకు సహకరించాలని రవి మోహన్ బట్ కోరారు.

























