హైదరాబాద్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి…
హైదరాబాద్ లో 87వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు (irc )కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురువారం కలిశారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోందని, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆర్మూర్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డును, అలాగే ముఖ్య కూడళ్లలో ఫ్లైఓవర్లను మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు.
అదేవిధంగా ఆర్మూర్ నుండి కరీంనగర్ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
తమ వినతులపై కేంద్రమంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు.
























