ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించిన అధికారులు…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్ జిల్లా: ఇందల్వాయి, మండల్ : ఇందిరమ్మ జయంతి సందర్భంగా పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ఇందల్వాయి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీ సచివాలయంలో అధికారులు ప్రారంభించారు.
ఎంపీడీవో అనంతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుమన్‌పల్లి, సర్పంచ్ చింతల కిషన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో అనంతరావు మాట్లాడుతూ.. పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు కార్యక్రమాన్ని గంగారం తండా గ్రామపంచాయతీలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబం ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగీత దిలీప్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సుదర్శన్ నాయక్, వెంగల్పాడు సర్పంచ్ మీనా గంగాధర్, ఎంపీఓ శ్రీనివాస్, ఉపసర్పంచ్ ధూమ, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, లోలం పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

























