భీమ్‌గల్‌లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క
రూ.4 కోట్ల అంచనా వ్యయంతో అతిథి గృహం నిర్మాణానికి భూమిపూజ
మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఇలా త్రిపాఠి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్, నవంబర్ 20: నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం శాసనమండలి సభ్యులు బి. మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి భీమ్‌గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, విశిష్టతలను ఆలయ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అంతకుముందు ఆలయ ప్రాంగణంలో సుమారు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అతిథి గృహానికి మంత్రి సీతక్క భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రి సీతక్కకు పూల మొక్కను అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్త ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రికి స్వామివారి పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
























