ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు
అర్హులైన ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు భీంగల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు నెల రోజులపాటు నాలుగు విడతల్లో అర్హులైన కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా భీంగల్ పురపాలక సంఘ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగస్వాములు కావాలని సూచించారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా ప్రజలు సంబంధిత వివరాలతో ప్రత్యేక కౌంటర్లను సంప్రదించాలని కోరారు.
ఈ మేరకు భీంగల్ పురపాలక సంఘ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
























