నూతన పెన్షన్లు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా,ధర్పల్లి : మండలంలో నూతనంగా మంజూరైన వివిధ రకాల 469 పెన్షన్ల ను ఎమ్మెల్యే భూపతి రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని హామీలను నెరవేరుస్తున్నామని,ఉచిత బస్సు,గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్,సన్న బియ్యం,ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు,అర్హులైన ప్రతీ కుటుంబానికి నూతన రేషన్ కార్డ్ ఇవ్వడం జరిగిందని,అన్ని కుటుంబాలకు 5 లక్షల బీమా కల్పిస్తూ ఇంకా అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.రైతులు ఎల్ నినో ప్రభావం ఉన్నందువల్ల రెండవ పంటగా వరి వేయవద్దని,ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేసిన భూగర్భ జలాలు అడుగంటితే పంట నష్టం జరుగుతుందని,ఉపాధి హామీ లో పనులను 100 రోజుల నుండి 150 రోజులకు పెంచడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహెర్ బిన్ హమ్దాన్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్,సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, మండల అధ్యక్షులు గాదె నరేష్ సీనియర్ నాయకులు చెలిమిల నరసయ్య.చక్రపాణి. మనోహర్ రెడ్డి. సుభాష్. మిట్టపల్లి గంగారెడ్డి.సురేందర్ గౌడ్. పలువురి పార్టీ నాయకులు,మండల అధికారులు,పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






















