Homeతెలంగాణయువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య...

యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య…

యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

యువతలో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం పెంపొందినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య అన్నారు.

అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్-1 ఆధ్వర్యంలో “యువ సంకల్పం – సమాజ వికాసం” అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎ. పున్నయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం విద్యాభ్యాసానికే పరిమితం కాకుండా సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలని, వాటి పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన యూజీసీ వ్యవహారాల డీన్ డాక్టర్ పాత నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సేవాభావం, సామాజిక స్పృహ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

కార్యక్రమ నిర్వాహకులు, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-1 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థుల ఆలోచనలు, ఆకాంక్షలు, హక్కులు, బాధ్యతలకు వేదిక కల్పించడంతో పాటు వారిలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. యువత సమాజంలో సానుకూల మార్పునకు చోదకశక్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా విద్యార్థిని సౌందర్య ఆలపించిన గీతం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు అనిల్ కుమార్, స్వాతి, మనోహర్, నీరజ తదితరులు ప్రసంగిస్తూ విద్యార్థుల హక్కులు, బాధ్యతలు, సమాజంలో యువత పాత్ర, సామాజిక సేవ, నాయకత్వ లక్షణాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. దత్తహరి, డాక్టర్ బి. రామలింగం, డాక్టర్ ఎం. నర్సయ్య, డాక్టర్ బి. ప్రవీణ్ తదితర అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి గ్రామ పంచాయతీలో 60 మంది కూలీలు తప్పనిసరి…

0
ప్రతి గ్రామ పంచాయతీలో 60 మంది కూలీలు తప్పనిసరి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల ఆదేశాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం గాంధారి :మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై జరిమానాలు విధిస్తాం: సీఐ నరహరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యల...

మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ…

0
మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం మాచారెడ్డి చౌరస్తా సమీపంలోని రైతు వేదికలో బుధవారం...

హొన్నాజీపేటలో 70వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం…

0
హొన్నాజీపేటలో 70వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా 70వ ఎస్జీఎఫ్ మండల...

ధర్పల్లి గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…

0
ధర్పల్లి గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండలం లోని గ్రంథాలయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి...

Translate »
error: Content is protected !!