నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డీజీపీకి ఎమ్మెల్యే డా.ఆర్. భూపతిరెడ్డివిజ్ఞప్తి.ఇందల్వాయి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్యే డిచ్పల్లి 7వపోలీస్బెటాలియన్లో శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో నూతన భవనాల నిర్మాణానికిప్రతిపాదనలు.పోలీస్ స్టేషన్ల పరిధుల మార్పు, మౌలిక సదుపాయాల కల్పనపైడీజీపీకివినతినిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు శనివారం నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన డీజీపీ సీవీ ఆనంద్‌ను ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి ఓ ప్రైవేట్ హోటల్లోమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీని శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందజేశారు.అనంతరం నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ,పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు, పోలీస్ బెటాలియన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగాచర్చించారు.పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు విజ్ఞప్తినిజామాబాద్ రూరల్, మోపాల్ పోలీస్ స్టేషన్ల పరిధులను ప్రజల సౌలభ్యం,పరిపాలనా అవసరాలు,శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొనిపునర్వ్యవస్థీకరించాలని ఎమ్మెల్యే డీజీపీని కోరారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జలాల్పూర్, మల్కాపూర్ (ఏ), పాల్దా గ్రామాలతో పాటు నిజామాబాద్ VI టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్, సారంగాపూర్ ప్రాంతాలను నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోఉన్నపాంగ్రా,మాధవ్‌నగర్ గ్రామాలతో పాటు నిజామాబాద్ IV టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్గాం (పి) గ్రామాన్ని మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలని కోరారు.ఈ మార్పుల ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు పోలీస్ సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు పోలీస్ పరిపాలన,శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగాసాగుతుందనివివరించారు.ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌కు నూతనభవననిర్మాణంచేపట్టాలి.నియోజకవర్గంలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోందని ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.పోలీస్ సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించడంతో పాటుప్రజలకుసమర్థవంతమైన సేవలు అందించేందుకు ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌కు సొంత భవనం అవసరమని పేర్కొన్నారు. ఇందుకోసం నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు 7వ పోలీస్ బెటాలియన్‌లో నూతన భవనాలు,మౌలిక వసతులకు నిధులు మంజూరు చేయాలి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంగా ఉన్న 7వ పోలీస్ బెటాలియన్‌లో 1975లో బెటాలియన్ ఏర్పాటైన నాటి నుంచి నిర్మించిన పలు భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకుచేరుకున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా పరిపాలనా భవనం, స్టాఫ్ క్వార్టర్స్ పాతబడిపోవడంతో పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో బెటాలియన్‌లో కింది నూతన నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని డీజీపీని కోరారు.నూతన పరిపాలనాభవనం.అసిస్టెంట్ కమాండెంట్ క్వార్టర్స్ – 02.ఆర్ఐ క్వార్టర్స్ – 04.
ఆర్ఎస్ఐ క్వార్టర్స్ – 10.
మెన్ క్వార్టర్స్ – 300.
బెటాలియన్ ప్రాంగణంలో 1,300 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం.పోలీస్ సిబ్బందికి మెరుగైననివాస,పరిపాలనా సదుపాయాలు కల్పించడంతో పాటు బెటాలియన్‌లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం అత్యవసరమని ఎమ్మెల్యేపేర్కొన్నారు.సానుకూలంగాస్పందించినడీజీపీ.నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణ,ఇందల్వాయి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణం,డిచ్పల్లి 7వ పోలీస్ బెటాలియన్‌లో నూతన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినప్రతిపాదనలనుసత్వరమేపరిశీలించాలని ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి డీజీపీని కోరారు.ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడం,పోలీస్ భద్రతను పటిష్టం చేయడం, శాంతిభద్రతలను సమర్థవంతంగాపరిరక్షించడం,ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం వంటి అంశాల్లో ఈ ప్రతిపాదనలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని వివరించారు.
ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తులపై డీజీపీ సీవీ ఆనంద్ సానుకూలంగాస్పందించినట్లు డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థబలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టే దిశగాఈభేటీఉపయోగపడుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

























