తెలంగాణ నుండి టీం లీడర్లుగా ముగ్గురికి అవకాశం పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్ గా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి నియమితులయ్యారు.ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్ ద్వారా భారత్ మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య పార్లమెంటరీ స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం, అలాగే విద్య, వాణిజ్యం, సాంస్కృతిక రంగాలలో సహకార అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అర్వింద్ టీం లీడర్ గా ఉన్న ఈ గ్రూపులో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ – రాజ్యసభ (NOM)లక్ష్మీకాంత్ పప్పు నిషాద్ – లోక్సభ (SP)అమర్ శరద్రావ్ కాలే – లోక్సభ (NCP-SP)ఖలీలుర్ రహమాన్ – లోక్సభ (AITC)హనుమాన్ బేనివాల్ – లోక్సభ (RLP)డా. ప్రభా మల్లికార్జున్ – లోక్సభ (INC)శివమంగళ్ సింగ్ తోమర్ – లోక్సభ (BJP)ఐ.ఎస్. ఇన్బదురై – రాజ్యసభ (AIADMK)రణదీప్ సింగ్ సుర్జేవాలా – రాజ్యసభ (INC)సదానంద్ మ్హాలు తనవాడే – రాజ్యసభ (BJP) సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక బాధ్యతకు ఎంపిక కావడం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు గర్వకారణం. అర్వింద్ ధర్మపురి ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచుతారని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోదీ కి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లకు ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలియజేశారు.కాగా తెలంగాణ నుంచి కువైట్ టీం లీడర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఒమన్ టీం లీడర్ గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ టీం లీడర్లుగా ఎంపికయ్యారు.























