కంచెట్టి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
డిచ్ పల్లి మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్ మరణం పార్టీకి తీరని లోటని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శనివారం కంచెట్టి గంగాధర్ కుటుంబ సభ్యులను డిచ్ పల్లి లో గల వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కంచెట్టి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తమలో ఒకరిగా ఉన్న కంచెట్టి గంగాధర్ ఇప్పుడు లేరన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.
ఎమ్మల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పార్టీ డిచ్ పల్లి మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్, పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్,చింతల కిషన్, లారీ గంగారెడ్డి, ఉమ్మాజి నరేష్,రాంచందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

























