తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు ఆదేశాల మేరకు ప్రొఫెసర్ పి. కనకయ్యను తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా నియమిస్తూ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈరోజు ప్రొఫెసర్ పి. కనకయ్య వైస్ ఛాన్సలర్ చేతులు మీదుగా నియామకపత్రం అందు కున్నారు.ప్రొఫెసర్ పి. కనకయ్య గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా, అకాడెమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ , ప్రిన్సిపాల్ గా,డీన్ గా,అడ్మిషన్స్ డైరెక్టర్ గా , ఇంకా అనేక అడ్మినిస్ట్రేషన్ పదవులు విజయవంతంగా పూర్తి చేసినా రు. ప్రస్తుతం సీనియర్ ప్రొఫెసర్ గా వివిధ సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వైస్ ఛాన్సల ర్ మరియు రిజిస్ట్రా ర్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే తనను అభినందించిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాని కి ధన్యవాదాలు తెలియజేశారు.



















