Homeఆరోగ్యం*పి సి పి ఎన్ డి టి జిల్లా సలహా సంఘం సమావేశం

*పి సి పి ఎన్ డి టి జిల్లా సలహా సంఘం సమావేశం

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్బస్తపూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ  అధ్యక్షతన డిఎంహెచ్వో కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ పి సి పి ఎన్ డి టి లో నమోదు అయినా వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలి నమోదు కానీ వైద్యులు స్కానింగ్ మిషన్ల ద్వారా గర్భిణీ స్త్రీలను స్కానింగ్ చేయరాదని తెలియజేసినారు. ఏ వైద్యులు అయితే స్కానింగ్ మిషన్ కొనదలచినారో వారు ముందుగా జిల్లా వైద్యాధికారి  కార్యాలయం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత స్కానింగ్ మిషన్ వచ్చిన ఫార్మ్ బి సర్టిఫికెట్ లో కొత్త స్కానింగ్ మిషన్ వివరాలు అలాగే దానిని ఉపయోగించే వైద్యుని వివరాలు ఉండాలి అని తెలియజేసినారు. జిల్లా వైద్యాధికారి అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్లను ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి, ఒక ఆసుపత్రి నుండి ఇంకో ఆసుపత్రికి బదలాయించడం కూడా నేరమని ఇలా చేస్తే సంబంధిత వ్యక్తులపై టి సి పి ఎన్ డి టి చట్టం మరియు రూల్స్, నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలియజేసినారు. అదేవిధంగా స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేయరాదని, ఒకవేళ చట్టం నియమ నీబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పుట్టబోయే శిశువు అమ్మాయి అని తెలియజేసి, వెంటనే గర్భ విచ్చిత్తి కి పాల్పడినట్లయితే వారిపై ఎంటిపి చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అన్నారు. పి సి పి ఎన్ డి టి మరియు ఎంటిపీ చట్టాలను ఉల్లంఘించడం ద్వారా సమాజంలో స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి తగ్గిపోతున్నదని పుట్టబోయే శిశువు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరూ సమానమే అని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు రేడియాలజిస్ట్ డాక్టర్ శ్వేత, గైనకాలజిస్ట్ డాక్టర్ ఇందు ,చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రభావతి ,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుప్రియ ,డాక్టర్ శిఖర, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రేమలత, స్వచ్ఛంద సేవ మహిళా సంఘం నుండి పద్మాసింగ్, డి హెచ్ ఈ వేణుగోపాల్ , హెచ్ ఇ ఓ సురేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.....

0
అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు... ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా... కన్నులపండుగగా శోభాయాత్ర... ఇందూరు: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్...

స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 

0
స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  ఇందూరు: జనగణన 2027 లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నగరంలోని తన...

జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ ..జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే...

0
జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ .. జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే క్షవీన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో...

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం

0
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం ఆదివారం : 26/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ...

నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం : 26/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో, నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం...

Translate »
error: Content is protected !!