రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేశ్ అన్నారు. మంగళవారం మంగళగిరిలోని చినకాకానిలో మయూరి టెక్ పార్క్ భవనంలో ఏర్పాటు చేసిన ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. గత 20 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున పెట్టుబడులు సాధించిందన్నారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయన్నారు.

























