నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, IPS ఆదేశాల మేరకు CCS ఏ.సీ.పీ ఇంచార్జ్ మస్తాన్ ఆలి సూచనల మేరకు ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్ , ఎస్.ఐ గోవింద్, సిబ్బందితో కలిసి నిజామాబాద్ టౌన్- 1 పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి కంపొండ్, కెనాల్ కట్ట, ఎరుకలవాడ నందు పిడిఎస్ బియ్యం ఉన్నాయన్న సమాచారం మేరకు షేక్ సాహెబ్ హుస్సేన్ ఇంట్లో సుమారు 40 కింటల్స్ పిడిఎస్ బియ్యము మరియు పిడిఎస్ బియ్యం తరలించడానికి ఉపయోగించిన మహేంద్ర బుల్లోరో వాహనం (TS16UC0862) సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన పిడియస్ బియ్యము మరియు బొలెరో వాహనాన్ని నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ SHO గారికి తగు చర్య నిమిత్తం అప్పచెప్పడం జరిగింది.



















