Homeనిజామాబాద్ జిల్లా వార్తలుకందకుర్తి పుష్కర ఘాట్ ను సందర్శించిన కలెక్టర్

కందకుర్తి పుష్కర ఘాట్ ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్, ఫిబ్రవరి 25 : రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని ప్రధానమైన ఈ పుష్కర ఘాట్ ను క్షేత్రస్థాయిలో సందర్శించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పుష్కర ఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గోదావరి పుష్కరాలకు ఈ ఘాట్ వద్ద వీ.వీ.ఐ.పీలు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటివి పక్కాగా అందుబాటులో ఉండాలన్నారు. భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు వంటలు చేసుకునేందుకు వీలుగా కిచెన్ షెడ్ నిర్మించాలని సూచించారు. పుష్కర ఘాట్ వద్ద మెట్లు, ఘాట్ వంటి వాటికి అవసరమైన మేర మరమ్మతులు చేయించాలని అన్నారు. ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని, హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, రహదారికి మరమ్మతులు జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

Translate »
error: Content is protected !!