ముష్కరుల దాడి నేపథ్యంలో రుద్రూర్లో న్యాయ వాది నివాసానికి వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ కళ్యాణి కి ధైర్యం చెప్పి, పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.“ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దాడులు జరుగుతున్నా మౌనం పాటించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థంగా మారింది” అని అన్నారు.అదేవిధంగా దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “నేరస్తులు ఎవరు అయినా వదిలిపెట్టము, బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం లో హిందువుల పై హిందూ దేవుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అని అన్నారు ఇప్పటివరకు కనీసం స్పందించని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మత ఘర్షణలో చిచ్చు పెడుతున్న వారిని ప్రోత్సహిస్తున్న వారు ఎవరు మీరు వయసులో పెద్దవారు అయినా కూడా మీరు ఇప్పటివరకు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా మీకు ఓట్ల రాజకీయమే కావాలని అనుకుంటే మీయొక్క రెడ్డి పేరుని తీసేసి ముస్లిం గా మారండి కానీ హిందువులకు హిందూ మహిళ పైన దాడులు చేస్తున్న కూడా మీరు పట్టింపు చర్యలు తీసుకోకపోతే మీరు ఎంత పదవిలో ఉన్నా కూడా వృధానే…ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు హరికృష్ణ, కృష్ణంరాజు, రాజు, ప్రశాంత్ గౌడ్, అనిల్, మురళి, గజేందర్,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు.























