Homeత్రిశూల్ న్యూస్మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కుతుంది. ప్రపంచంలోనే మన దేశం మహిళలకు ప్రత్యేక హోదా ఉంది.

మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కుతుంది. ప్రపంచంలోనే మన దేశం మహిళలకు ప్రత్యేక హోదా ఉంది.

* ప్రతి రంగంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలనీ వక్తల పిలుపు*

నిజామాబాద్ మార్చ్ 11:–మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రతిభను కనబరచాలని,

మహిళలు అన్ని రంగాల్లో గౌరవింపబడాలి అని వక్తల పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, న్యాయవాది, పి పి నీరజ రెడ్డి, ప్రముఖ వైద్యురాలు బండారి సుజాత, అర్బన్ సిడిపిఓ సౌందర్య, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ స్పెషల్ స్కూల్ ప్రిన్సిపల్స్ జ్యోతి, రాజేశ్వరి, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత హాజరయ్యారు. మొదట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రెస్ క్లబ్లో ఆనవాయితీగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ.. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహిళల పాత్ర లేనిదే సమాజ మనుగడ ముందుకు సాగదని పేర్కొన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, జర్నలిజంలో కూడా తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని తెలిపారు. సమాజంలో మహిళలు, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పని చేస్తూ దూసుకుపోతున్నారన్నారు.న్యాయవాది, పీపీ నీరజ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిజంలో కూడా మహిళలు విశేషంగా రాణిస్తు ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధులుగా నవ సమాజ స్థాపనకు పాటుపడుతు న్నారన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పలుచట్టాలపై అవగాహన కల్పించారు. ప్రముఖ వైద్యురాలు బండారి సుజాత మాట్లాడుతూ..

వృత్తితో పాటు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సక్రమంగా ఉంటుందన్నారు. నిత్యం వార్తలలో బిజీగా ఉంటూ కడప గడప ఇలాంటి కార్యక్రమాలు జరపడం బాగుందన్నారు. సిడిపిఓ సౌందర్య మాట్లాడుతూ..ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని దానికి అనుగుణంగా మహిళలు ఉన్నత చదువులు చదువుకొని శక్తివంతులై అన్ని రంగాల్లో ముందుకు రావాలని అన్నారు.స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ స్పెషల్ స్కూల్స్ ప్రిన్సిపల్ జ్యోతి, రాజేశ్వరి మాట్లాడుతూ..మహిళలు ప్రస్తుత సమాజంలో ఎటువంటి అనుచివేత గురికాకుండా, మహిళా శక్తివంతులుగా, స్వయం శక్తి ఎదగడానికి ప్రభుత్వం కృషి చేయాలని, సంఘంలో ఎటువంటి అణచివేతకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినమైనా చట్టాలను తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు .అదేవిధంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యాచారాలు మానభంగాలను తిప్పి కొట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.ప్రతి మహిళ చైతన్యమై అన్యాయాలపైన తిరుగుబాటు చేయాలని అప్పుడే మహిళ ఆత్మ గౌరవానికి విలువలు ఉంటాయని అన్నారు.అనంతరం ముఖ్య అతిథులకు మహిళ జర్నలిస్టుల చే శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా మహిళా జర్నలిస్టులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. రాజు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు,సీనియర్ జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, రిపోర్టర్లు తదితరు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

Translate »
error: Content is protected !!