Homeతెలంగాణ_తెలుగులో ప్రమాణం.. తెలంగాణ కొత్త గవర్నర్ విశేషాలు ఇవే!

_తెలుగులో ప్రమాణం.. తెలంగాణ కొత్త గవర్నర్ విశేషాలు ఇవే!

_తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నివాసం.. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ నూతన గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు._

_ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే.. ఇతర గవర్నర్ల మాదిరిగా కాకుండా.. ప్రతాప్ శుక్లా.. తన ప్రమాణ పత్రాన్ని పూర్తిగా తెలుగులోనే చదవడం విశేషం._

*_ఎవరీయన?_*

_ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన శివప్రతాప్ శుక్లా వృత్తి రీత్యా న్యాయవాది. అయితే.. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఈ వృత్తిని వదులుకున్నారు. బీజేపీ వ్యవస్థాపన నుంచి ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. 1989 నుంచి ప్రజాప్రతినిధిగా కూడా పనిచేశారు. 1989 నుంచి 2012 వరకు ఆయన గోరఖ్ పూర్ రూరల్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన తొలి బీజేపీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత.. రాష్ట్ర బీజేపీ సారథ్య బాధ్యతలు కూడా నిర్వహించారు._ _ఇక, 2016లో రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2017 సెప్టెంబరు 3 నుండి 2019 మే 30 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా శుక్లా పనిచేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినప్పటికీ.. ఆయన నిమ్న వర్గాల అభ్యున్నతి, వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారన్న పేరుంది. 2023 ఫిబ్రవరి 13 నుండి హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల గవర్నర్ల బదిలీ ప్రక్రియలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చారు. మంచివిద్యావేత్తగా, ఆలోచనా పరుడిగా.. ఆయనకు పేరుండడం గమనార్హం._

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

లంపి చర్మ వ్యాధిని ఎదుర్కోవడానికి మహారాష్ట్ర ఇంట్లో మేకపాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది

0
ప్రాతినిధ్య ప్రయోజనం కోసం చిత్రం పూణే: రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ బయోలాజికల్ ప్రొడక్ట్స్ (IVBP) ఇటీవలి సంవత్సరాలలో మహారాష్ట్ర అంతటా వేలాది జంతువులను చంపిన ముద్ద...

Translate »
error: Content is protected !!