రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్…
రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్మూర్ డిపో మేనేజర్ శ్రీమతి ప్రతిమ రెడ్డి గారు తెలిపారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదర సోదరీమణులు తమ స్వగ్రామాలకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్–ఆర్మూర్ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు, రద్దీకి అనుగుణంగా అవసరమైన అదనపు సర్వీసులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రయాణికులు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆమె సూచించారు.
ఆర్మూర్ డిపోమేనేజర్ శ్రీమతి ప్రతిమ రెడ్డి

























