ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ సదాశివ్…
ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మహిళా సంఘాల ద్వారా అందించే రుణాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని ఏపిఎం కుంట గంగాధర్ పేర్కొన్నారు.

ఓపెన్ స్కూల్ విధానంలో మహిళా సంఘ సభ్యులకు పదవ తరగతి మరియు వన్ సిట్టింగ్ విధానంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈ నెలాఖరులోగా ఫీజు చెల్లించి పరీక్షలు రాయవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్కూల్ యూనిఫార్మ్స్ నాణ్యతతో తయారు అయ్యేలా చూడాలని, ప్రతి మహిళా సంఘం తీసుకున్న రుణాలను 100% తిరిగి చెల్లించేలా చూడాలని కోరారు. ఇందుకు గ్రామ సమాఖ్యలలో నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.
ప్రతి గ్రామ సమాఖ్యలో కనీసం ఇద్దరు రైతుల చేత ఫారం పాండ్స్ నిర్మించేలా ప్రోత్సహించాలని ఇందుకు ప్రభుత్వం ద్వారా రెండు లక్షలకు పైగా ఆర్థిక సహాయం పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుందని ఏపీవో విద్యానంద్ పేర్కొన్నారు.
ఏర్గట్ల మహిళా సమాఖ్య బ్యాంకు లింకేజీ మరియు స్త్రీ నిధిలో జిల్లాలోనే అగ్రస్థానంలో ఉందని ఇందుకు స్థానిక ఏపిఎం కుంట గంగాధర్ తోపాటు సీసీ రవికుమార్, 13 మంది వివోఏల కృషి ఎంతగానో ఉందని ఎన్నికల అధికారిగా హాజరైన కమ్మర్పల్లి ఐకెపి ఏపిఎం కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
అలరించిన అష్టగంగాధర్. ఐకెపి జిల్లా కల్చరల్ కోఆర్డినేటర్ అష్టగంగాధర్ ముఖ్యఅతిథిగా హాజరై తన గాన కళా ప్రదర్శనతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు.
పసుపు ప్రాధాన్యతను వివరించే పాటతో పాటు మహిళా సంఘాల కార్యకలాపాల పైన కూడా పలు ఆటపాటలు నిర్వహిస్తూ చక్కని గేయాలపనతో సమావేశానికి హాజరైన మహిళలను మంత్రముగ్తుల్ని చేశారు.
నూతన కార్యవర్గం ఎన్నిక.
మండల మహిళా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కుందెనలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా దోమచందా లావణ్య ప్రధాన కార్యదర్శిగా ఎర్గట్ల లావణ్య, సహాయ కార్యదర్శిగా గోదావరి, కోశాధికారిగా గంగజమున, ఈసీ ప్రతినిధిగా దేవాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో సీసీలు భలేరావు రవికుమార్, నవీన్, పీరియా, స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి, మండల సమాఖ్య సిబ్బంది సుప్రియ, జాహిద, గ్రామ సమాఖ్యల అధ్యక్షురాల్లు వివోఏలు సిఆర్పిలు హాజరయ్యారు.

























